Pawan Kalyan: జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ ఐదేళ్లు సీఎంగా ఉంటారు: హరిరామజోగయ్య

hari rama jogayya sensational comments on pawan kalyan
  • జనసేన బలం గతంలో కంటే పెరిగిందన్న హరిరామజోగయ్య
  • బీజేపీతో జనసేన కలిస్తే మోదీ చరిష్మా తోడయి బలం చేకూరుతుందని వెల్లడి
  • టీడీపీ కూడా కలిస్తే వైసీపీ ఓటమి మరింత సులువు అవుతుందన్న కాపు నేత
మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ఐదేళ్లు సీఎంగా ఉంటారని అన్నారు. బీజేపీతో కలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా తోడయి అదనపు బలం చేకూరుతుందని అన్నారు. 

ఓ మీడియా చానల్ తో హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. జనసేనతో టీడీపీ కూడా కలిస్తే ఇక వైసీపీ ఓటమి మరింత సులువు అవుతుందని చెప్పారు. జనసేన బలం గతంలో కంటే పెరిగిందని అన్నారు. ఒంటరిగా పోటీ చేసేందుకు పవన్ పార్టీ భయపడాల్సిన పని లేదని అన్నారు. 

ప్రతిపక్షాల ఓటు చీలకుండా చూసుకుంటే వైసీపీని ఓడించవచ్చని హరిరామ జోగయ్య చెప్పారు. టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేయడానికి ముఖ్యమంత్రి పదవి అడ్డుగా ఉందని, సీఎం ఎవరు కావాలనే ప్రశ్న ఎదురవుతోందని చెప్పారు. చంద్రబాబు మెట్టు దిగి వచ్చి.. అధికారంలోకి వచ్చాక చెరో సగ కాలం సీఎం పదవిని పంచుకోవాలన్నారు. అప్పుడు రెండు పార్టీల కార్యకర్తలు సంతృప్తి చెందుతారని చెప్పారు.
Pawan Kalyan
hari rama jogayya
Janasena
TDP
YSRCP
BJP
Chandrababu

More Telugu News