Bandi Sanjay: హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ.. కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు

on the occasion of april fools day bandi sanjay interesting tweet on cm kcr
  • కేసీఆర్ లక్ష్యంగా బండి సంజయ్ ట్వీట్
  • నిరుద్యోగ భృతి కింద రూ.3,016 అకౌంట్లో పడ్డాయంటూ ఎద్దేవా
  • సంజయ్ మాదిరే కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీని టార్గెట్ చేస్తూ కేటీఆర్, కేసీఆర్ ఫ్యామిలీ లక్ష్యంగా బండి సంజయ్ ట్విట్టర్ లో విరుచుకుపడుతుంటారు. తాజాగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగ భృతిని ప్రతి నెల ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ‘‘ఓ నిరుద్యోగి ఫోన్ కు వచ్చిన మెసేజ్’’ అని రాసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో ‘‘మీ అకౌంట్ లో రూ.3,016 పడ్డాయి’’ అనే మెసేజ్ ఉంది. కింద కేసీఆర్ నవ్వుతున్న ఫొటోను పెట్టారు. 

‘‘నిరుద్యోగ యువతకు రూ.3,016 భృతి ఇస్తాం- సీఎం కేసీఆర్. మీరు దీనిని నమ్మితే ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. బండి సంజయ్ మాదిరే నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. 

‘హుసేన్ సాగర్ లోకి కొబ్బరినీళ్లు’ ‘సిగ్నల్ ఫ్రీ సిటీ’, ‘ప్రతి మండలంలో 30 బెడ్ల ఆసుపత్రులు’ అంటూ గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇదే సమయంలో బీజేపీని ఎగతాళి చేస్తూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ‘‘నాకైతే రూ.15 లక్షలు పంపాడు మోడీ తాత. నీకు వచ్చాయా బంటి అన్న’’ అంటూ ఓ ఫేక్ మెసేజ్ తో కౌంటర్ ఇచ్చాడు.
Bandi Sanjay
KCR
april fools day
BRS
BJP

More Telugu News