Raj karrthikeyan: థ్యాంక్స్ .. చిన్న సినిమాకి పెద్ద సక్సెస్ కట్టబెట్టారు: హీరో రాజ్ కార్తికేన్

Raj Kahani movie update
  • రాజ్ కార్తికేయన్ హీరోగా వచ్చిన 'రాజ్ కహానీ'
  • కథానాయికగా చంద్రిక అవస్తి పరిచయం
  • సంగీతాన్ని అందించిన మహిత్ నారాయణ్  
  • మహిళా ప్రేక్షకుల ఆదరణ బాగుందన్న మేకర్స్  

భార్గవి క్రియేషన్స్ పతాకంపై మతాంతర ప్రేమకథ ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రమే 'రాజ్ కహానీ'. రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. మహిత్ నారాయణ్ (చక్రి తమ్ముడు) సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం, థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. 

ఈ సందర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నిర్మాత రమేష్ పుప్పాల, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, లయన్ సాయివెంకట్, తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ..చిన్న సినిమా అయినా కథలో మంచి కంటెంట్  ఉంటే ఆ సినిమా బిగ్ హిట్ అవుతుంది. అలాంటి మంచి కంటెంట్ తో వచ్చిన ఈ 'రాజ్ కహానీ' సినిమాను మనమందరం  ప్రోత్సహించి బిగ్ హిట్ చెయ్యాలి. ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే ఇంకా మంచి చిత్రాలు తీస్తారు" అంటూ చిత్ర యూనిట్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. 

చిత్ర దర్శకుడు -  హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ .. "మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన నేను, ఈ కథ రాసుకుని గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది నిర్మాతలకు వినిపించడం జరిగింది. ఎవరూ తీయడానికి ముందుకు రాకపోవడంతో చివరకు నేనే ఫ్రెండ్స్ .. ఫ్యామిలీ సపోర్ట్ తో స్టార్ట్ చేశాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ చాలా బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మహిళలు అందరూ తల్లి కొడుకుల సెంటిమెంట్ బాగుందని  చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది" అని అన్నాడు. 


Raj karrthikeyan
Chandrika Avasthi
Sonia Saaha
Priya Paul

More Telugu News