'శాకుంతలం' నుంచి బ్యూటిఫుల్ వీడియో సాంగ్!

  • సమంత టైటిల్ రోల్ ను పోషించిన 'శాకుంతలం'
  • దర్శకుడిగా గుణశేఖర్ చేసిన మరో ప్రయోగం
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మణిశర్మ సంగీతం 
  • ఏప్రిల్ 14వ తేదీన సినిమా విడుదల   

Shaakuntalam video song release

సమంత అభిమానులంతా 'శాకుంతలం' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఆమెను 'శకుంతల' పాత్రలో చూడటానికి ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నటుగా చెప్పారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 1:12 నిమిషాల నిడివిగల వీడియో సాంగును విడుదల చేశారు. 'మల్లికా మల్లికా మాలతీ మాలిక .. చూడవా చూడవా ఏడే నా ఏలికా' అంటూ ఈ పాట సాగుతోంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను రమ్య బెహ్రా మధురంగా ఆలపించింది. గుణశేఖర్ అద్భుతంగా ఈ పాటను చిత్రీకరించారు.

దుష్యంతుడి కోసం ఎదురుచూస్తూ శకుంతల పాడుకునే పాటగా ఇది తెరపైకి రానుంది. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాలో, మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమా, కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

More Telugu News