సాయి తేజ్ విరూపాక్ష షూటింగ్ కంప్లీట్

  • ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని సాయి తేజ్ ట్వీట్
  • చిత్ర యూనిట్ తో దిగిన ఫొటోను షేర్ చేసిన హీరో
  • ఏప్రిల్ 21న విడుదల కానున్న చిత్రం
Virupaksha wraps shooting

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తోంది. కార్తిక్‌ దండు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల రిలీజైన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్టరీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్‌ను కంప్లీట్‌ చేసినట్టు సాయితేజ్ ట్వీట్ చేశాడు. చిత్ర సిబ్బందితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఈ చిత్రానికి సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

More Telugu News