ఫ్యాషన్ ఈవెంట్ లో కోహ్లీ, అనుష్క స్టయిల్ అదుర్స్

  • డియోర్ ఆట‌మ్ 2023 ఫ్యాష‌న్ ఈవెంట్‌లో పాల్గొన్న దంపతులు
  •  ఈవెంట్ లో పాల్గొన్న సోన‌మ్ క‌పూర్‌, అన‌న్యా పాండే తదితరులు
  • షో స్టాపర్స్ గా నిలిచిన కోహ్లీ దంపతులు
Virat Kohli Anushka Sharma Make A Stylish Entry At Dior Event

సెలబ్రిటీ దంపతుల్లో క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ జంటది ప్రత్యేక స్థానం. ఈ ఇద్దరు జంటగా ఎక్కడ కనిపించినా ఆ ప్రాంతం అంతా సందడిగా మారుతుంది. అభిమానులు వీరిని ముద్దుగా విరుష్క అని పిలుస్తారు. ఆటలో కోహ్లీ, నటనలో అనుష్క మెప్పించారు. వీటితో పాటు ఇద్దరూ ఫ్యాష‌న్ లోనూ ముందుంటారు. తాజాగా ఈ స్టార్ జోడీ ముంబైలో జ‌రిగిన డియోర్ ఆట‌మ్ 2023 ఫ్యాష‌న్ ఈవెంట్‌లో పాల్గొన్న‌ది. గేట్‌వే ఆఫ్ ఇండియా వ‌ద్ద జ‌రిగిన షోలో కోహ్లీ, అనుష్క స్టయిల్ అందరినీ ఫిదా చేసింది. 

ఈ షోలో బాలీవుడ్ స్టార్స్ సోన‌మ్ క‌పూర్‌, అన‌న్యా పాండే, సైమోన్ ఆష్లే తోపాటు ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కోడలు రాధికా మ‌ర్చంట్ కూడా పాల్గొన్నారు. కానీ, కోహ్లీ, అనుష్క షో స్టాపర్స్ గా నిలిచారు. ఒలివ్ గ్రీన్ బ్లేజ‌ర్  వేసుకున్న విరాట్ కోహ్లీ సాఫ్ట్ లుక్ లో కనబడగా.. ఎల్లో గౌన్‌లో అనుష్క మెరిసిపోయింది. ఈ జంట ఇచ్చిన స్టిల్స్ ను క్యాప్చర్ చేసేందుకు ఫొటో గ్రాఫర్లు పోటీ పడ్డారు. పలు ఫోటోలను కోహ్లీ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు.

More Telugu News