Rahul Gandhi: రాహుల్ అనర్హతపై దిగ్విజయ్ వర్సెస్ కపిల్ సిబల్

  • రాహుల్ కు మద్దతిచ్చిన జర్మనీకి ధన్యవాదాలు చెప్పిన దిగ్విజయ్
  • దీన్ని తప్పుబట్టిన కపిల్ సిబల్
  • విదేశాల మద్దతు మనకు అవసరం లేదని ట్వీట్
Rahul Gandhi disqualified Dont need endorsements from abroad Kapil Sibal on Digvijaya Singhs tweet thanking Germany

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఆ పార్టీ మాజీ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మధ్య మాటల యుద్ధం నడించింది. అనర్హత వేటుకు గురైన రాహుల్ గాంధీకి అమెరికా, జర్మనీ మద్దతివ్వడంపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దిగ్విజయ సింగ్ జర్మనీకి ధన్యవాదాలు చెప్పడంతో వివాదం మరింత రాజుకుంది. దీన్ని కపిల్ సిబల్ తప్పుబట్టారు. విదేశాల నుంచి మద్దతు మనకు అవసరం లేదన్నారు. 

ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా దెబ్బతింటోందో గమనించినందుకు జర్మనీకి ధన్యవాదాలు చెప్పినట్టు దిగ్విజయ సింగ్ తెలిపారు. కానీ, మనం ముందుకు నడవడానికి ఊతకర్రలు అవసరం లేదనేది నా అభిప్రాయం. అలాగే, ఈ అంశంలో విదేశాల నుంచి మనకు మద్దతు అవసరం లేదు. మన పోరాటం మనదే. పోరాటంలో మనమంతా కలిసికట్టుగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. 

కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఉంటోందని వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం పార్లమెంటు సచివాలయం వయనాడ్ లోక్‌సభ సభ్యత్వానికి రాహుల్ అనర్హుడని ప్రకటించింది.

More Telugu News