Redmi: రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

Redmi launching new smartphone redmi note 12 turbo features and price details
  • త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న కంపెనీ
  • నాలుగు స్టోరేజ్ వేరియంట్లతో ఇప్పటికే చైనాలో లాంచ్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో పాటు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మరో బడ్జెట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేయనుంది. రెడ్‌మీ నోట్ టర్బో పేరుతో కొత్త ఫోన్ ను తీసుకొస్తోంది. నాలుగు స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ ను ఇప్పటికే చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్ లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫోన్‌లోని ఫీచర్లు, ధర తదితర వివరాలు..

రెడ్‌మీ నోట్ టర్బో ఫీచర్ల విషయానికి వస్తే..
6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ, అమోఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 13, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7, 2 జనరేషన్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ ను రూపొందించారు. 64 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ లతో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. రెడ్‌మీ నోట్ టర్బో 8 జీబీ ర్యామ్, 256 జీబీ రామ్ వేరియంట్ ధర రూ.23,900, 12 జీబీ ర్యామ్, 256 జీబీ రామ్ వేరియంట్ ధర రూ.26,300, 12 జీబీ ర్యామ్, 512 జీబీ రామ్ వేరియంట్ ధర రూ.28,700, 1 టీబీ స్టోరేజ్ ధర రూ.33,400.. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ, కార్బన్ బ్లాక్, ఐస్ ఫెదర్ వైట్ రంగుల్లో తయారుచేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Redmi
new phone
smart phone
budget smart phone
business
redmi note turbo

More Telugu News