'మీటర్' హిట్ ఈ పాయింట్ పై ఆధారపడి ఉంటుంది: కిరణ్ అబ్బవరం

  • మాస్ యాక్షన్ మూవీగా 'మీటర్'
  • కిరణ్ తో జోడీకట్టిన అతుల్య రవి 
  • 6 సినిమాల్లో 4 హిట్ కొట్టానన్న కిరణ్ 
  • ఏప్రిల్ 7న వస్తున్న 'మీటర్'
Kiran Abbavaram Interview

కిరణ్ అబ్బవరం నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మీటర్' సినిమా రెడీ అవుతోంది. ఈ మాస్ యాక్షన్ మూవీని ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలో దింపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. "ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ హీరోపై డ్రైవ్ అవుతుంది. హీరోను ఆడియన్స్ అంగీకరించారంటే సినిమా హిట్ కొట్టేస్తుందని చెప్పొచ్చు .. అలాంటి సినిమా ఇది"అని అన్నాడు. 

"ఈ సినిమాలో యాక్షన్ తో పాటు తండ్రీకొడుకుల మధ్య నడిచే ఎమోషన్స్ ఉంటాయి. విలన్ చేస్తున్న క్రైమ్ ఏదైతే ఉంటుందో.. ఆ పాయింట్ చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. కథ ఎక్కడా కూడా టైమ్ తీసుకోకుండా చాలా ఫాస్టుగా ముందుకు వెళుతూ ఉంటుంది. అందువలన ఎవరికీ బోర్ అనిపించే అవకాశం ఉండదు" అని చెప్పాడు. 

"ట్రైలర్ చూసినవాళ్లు 'పటాస్' లా ఉంటుందనీ ..'టెంపర్' లా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ అలాంటి పోలికలేం ఉండవు. నా బాడీ లాంగ్వేజ్ .. స్టైల్ చాలా కొత్తగా ఉంటాయి. క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతవరకూ విడుదలైన నా 6 సినిమాల్లో 4 హిట్. 'మీటర్' కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News