ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన దేశపతి

  • బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన దేశపతి
  • కె. నవీన్ కుమార్, చల్లా వెంకటరామిరెడ్డి కూడా ఏకగ్రీవం
  • ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Desapati srinivas oath as MLC

ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి దేశపతితో పాటు కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌, చల్లా వెంకటరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురూ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి తో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కొత్త ఎమ్మెల్సీలను అభినందించారు.

More Telugu News