ipl: తొలి మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ కు షాక్

Bhuvneshwar to captain in SRHs opening match in Markrams absence
  • ఆదివారం రాజస్థాన్ తో జరిగే మ్యాచ్ కు కెప్టెన్ మార్ క్రమ్ దూరం
  • నెదర్లాండ్స్ తో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో పాల్గొంటున్న మార్ క్రమ్, క్లాసెన్, మాస్కో జాన్సెన్
  • కెప్టెన్ గా వ్యవహరించనున్న భువనేశ్వర్ కుమార్
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా పలు కొత్త రూల్స్ తో  ఈ సీజన్ ఫ్యాన్స్ కు మరింత మజా పంచనుంది. గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు రాత్రి అహ్మదాబాద్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ తో ఐపీఎల్ 16వ ప్రారంభం అవుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్ ను ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. అయితే, మ్యాచ్ లో సన్ రైజర్స్ కెప్టెన్ సహా కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు, సన్ రైజర్స్ నూతన కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్, పేసర్ మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ ముగ్గురూ ఈ మ్యాచ్ కు దూరం అవుతున్నారు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు  నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ఆడుతోంది. మార్క్ రమ్, జాన్సెన్, క్లాసెన్ ముగ్గురూ జాతీయ జట్టుతో బిజీగా ఉన్నారు. శుక్ర, ఆదివారాల్లో రెండు మ్యాచ్ లు ఆడనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సన్ రైజర్స్ తొలి మ్యాచ్ కు ఈ ముగ్గురూ అందుబాటులో ఉండడం లేదు. దీంతో టీమిండియా వెటరన్ సీమర్ భువనేశ్వర్ కుమార్ జట్టును నడిపించనున్నాడు.. ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌ తో జరిగే మ్యాచ్‌కు మార్ క్రమ్, జాన్సెన్, క్లాసెన్ బరిలోకి దిగనున్నారు.
ipl
2023
srh
sunrisers hyderabad
Markram
Bhuvaneswar kumar

More Telugu News