ఉద్యోగం పోతుందనే భయంతో హైదరాబాద్‌లో టెకీ ఆత్మహత్య

  • పుప్పాలగూడలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని టెకీ బలవన్మరణం
  • విధుల్లో ఒత్తిడి, ఉద్యోగం పోతుందనే భయంతో ప్రాణం తీసుకున్న వైనం
  • మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా
Techie ends life in Hyderabad fearing layoffs

ఇటీవలి లేఆఫ్స్ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. భవిష్యత్తుపై బెంగతో అనేక మంది టెకీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. పుప్పాలగూడలో నివసించే వినోద్ కుమార్ ఉద్యోగం పోతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. విధుల్లో ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆయన.. ఉద్యోగం పోతుందని తీవ్ర మనస్తాపానికి లోనై ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు వదిలారు. 

కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వినోద్ కుమార్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఆయన పనిచేసేవారు.

More Telugu News