చక్రి భార్య ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ..!: ఆయన తమ్ముడు మహిత్ నారాయణ్

  • మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న చక్రి 
  • ఆయన మరణంతో జరిగిన ఆస్తి గొడవలు
  • కొన్ని ఆస్తులు కోర్టు పరిధిలో ఉన్నాయన్న మహిత్  
  • అన్నయ్య పేరుతో స్టూడియో పెట్టుకున్నానని వెల్లడి
Mahith Narayan Interview

సంగీత దర్శకుడిగా చక్రి చాలా తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత కాలంలో ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన చనిపోయారు. ఆ సమయంలోనే ఫ్యామిలీలో ఆస్తి పరమైన గొడవలు చోటుచేసుకున్నాయి. ఆ తరువాత ఏం జరిగిందనేది చాలామందికి తెలియదు. 

తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్యూలో చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ .. "అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఆర్థికపరమైన సమస్యలు ఉండేవి కాదు. ఆయన చనిపోయిన తరువాత మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాము. అన్నయ్య ఆస్తులు కొన్ని ఆయన భార్యకే దక్కాయి. ఆమె మరో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు" అని అన్నారు.

"అన్నయ్యకు సంబంధించిన మరికొన్ని ఆస్తులు కోర్టు కేసులో ఉన్నాయి. పెద్ద మనుషుల మధ్య సమస్య పరిష్కారం కాదని తెలిసి మేము కూడా కోర్టుకు వెళ్లడానికే ప్రాధాన్యతను ఇచ్చాము. కొంతకాలం క్రితం వరకూ నాకు ఒక స్టూడియో అంటూ ఉండేది కాదు. అందువలన అవకాశాలు రాలేదు. ఇటీవలే అన్నయ్య పేరుతో ఒక స్టూడియో పెట్టుకున్నాను .. ఇప్పుడు ఫరవాలేదు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News