నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

  • మరో వీడియో రిలీజ్ చేసిన ఖలిస్తానీ సపోర్టర్
  • 13 రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న అమృత్ పాల్
  • యూట్యూబ్ లో రెండు వీడియోలు.. ఒక ఆడియో మెసేజ్ విడుదల
  • లొంగిపోయేందుకు చర్చలు జరపలేదని వెల్లడించిన ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్
I Am Not Surrendering says Amritpal Singh

ఖలిస్తానీ మద్దతుదారుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ యూట్యూబ్ లో మరో వీడియో విడుదల చేశాడు. తను లొంగిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అందులో ఖండించాడు. లొంగిపోయే ఉద్దేశం తనకు లేదని, ఇందుకోసం ఎవరితోనూ చర్చలు జరపట్లేదని తేల్చిచెప్పాడు. పోలీసుల నుంచి తప్పించుకు తిరగడంలేదని చెప్పిన అమృత్ పాల్.. తాను తిరుగుబాటుదారుడినని చెప్పుకున్నాడు. ఈమేరకు యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియోలో అమృత్ పాల్ మాట్లాడాడు. గత 13 రోజులుగా పంజాబ్ పోలీసుల కళ్లుగప్పి అమృత్ పాల్ తిరుగుతున్నాడు.

తనను తాను మరో బింద్రన్ వాలాగా చెప్పుకుంటున్న అమృత్ పాల్.. సిక్కు యువతను తన ప్రసంగాలతో రెచ్చగొడుతున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గత నెల అమృత్ పాల్ అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. లవ్ ప్రీత్ సింగ్ ను విడిపించుకునేందుకు అమృత్ పాల్ ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేశాడు. కత్తులు, తుపాకులు ధరించి, అనుచరులతో కలిసి పోలీసులపై దాడికి దిగాడు. ఈ ఘటనపైనా అమృత్ పాల్ పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ రెండు కేసులకు సంబంధించి అమృత్ పాల్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే చివరి క్షణంలో తప్పించుకుని పారిపోయాడు. పదమూడు రోజులుగా వేషాలు మారుస్తూ పంజాబ్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. తనపై వస్తున్న ఆరోపణలపై యూట్యూబ్ లో ఇప్పటికే రెండు వీడియోలు, ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశాడు.

More Telugu News