Donald Trump: చిక్కుల్లో ట్రంప్.. పోర్న్ స్టార్​కు డబ్బులు ఇచ్చినట్టు కేసు నమోదు

Donald Trump indicted over hush money first US ex president to be criminally charged
  • హుష్ మనీ కేసులో ఆయనపై క్రిమినల్ ప్రాసిక్యూషన్
  • ఈ కేసు ఎదుర్కొంటున్న మొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా నిలిచిన ట్రంప్
  • 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌ కు డబ్బు ఇచ్చినట్టు  న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హుష్ మనీ కేసు నమోదైంది. ఈ కేసులో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కొన్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2016 ఎన్నికల ప్రచార సమయంలో పోర్న్ స్టార్‌కు డబ్బు చెల్లించడంపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్ పై అభియోగాలు మోపింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది డబ్బు చెల్లించారనడంపై ఇన్ని సంవత్సరాల దర్యాప్తు తర్వాత న్యూయార్క్‌లో ఆరోపణలు వెలుగుచూశాయి. స్టార్మీ డేనియల్స్‌కు 130,000 డాలర్ల చెల్లింపులపై విచారించిన తర్వాత ట్రంప్ పై గ్రాండ్ జ్యూరీ నేరారోపణ చేసింది. 

అయితే, ఆ ఆరోపణలను ట్రంప్ ఖడించారు. 2024లో మరోసారి అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ట్రంప్‌ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. తాను అమాయకుడినని ఓ ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు. కాగా, 2006వ సంవత్సరంలో ట్రంప్‌ సాగించిన లైంగిక వేధింపుల గురించి మౌనంగా ఉన్నందుకు బదులుగా తనకు డబ్బు అందిందని స్టార్మీ డేనియల్స్ చెప్పారు. 2018వ సంవత్సరంలో ఆరోపణలు వచ్చినప్పటి నుంచి డేనియల్స్‌తో తనకు ఎలాంటి లైంగిక సంబంధం లేదని డొనాల్డ్ ట్రంప్ ఖండించారు.

అయితే, డేనియల్స్‌ డబ్బు చెల్లింపులపై ట్రంప్‌తో సమన్వయం చేసుకున్నట్టు ఆయన వ్యక్తిగత న్యాయవాది మైఖేల్ కోహెన్ తెలిపారు. ట్రంప్‌తో లైంగిక సంబంధం ఉన్నట్టు తెలిపిన మరో మహిళ, మాజీ ప్లేబాయ్ మోడల్ కరెన్ మెక్‌డౌగల్‌ కు కూడా డబ్బు అందినట్లు చెప్పారు.

Donald Trump
USA
hush money
case
criminally charged

More Telugu News