తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. టైమింగ్స్, ప్రయాణ సమయం ఇలా..

  • ఏప్రిల్ 9న తిరుపతి నుంచి పరుగులు పెట్టనున్న రైలు
  • అంతకుముందు రోజు సికింద్రాబాద్‌లో ప్రారంభం
  • 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి
  • మంగళవారం మినహా మిగతా రోజుల్లో అందుబాటులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
Vande Bharat Express Between Secunderabad and Tirupati

తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మరీ ముఖ్యంగా తిరుపతి వెంకన్న భక్తులకు ఇది శుభవార్తే. వందేభారత్ మరో రైలు అందుబాటులోకి వచ్చేస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య పరుగులు పెట్టనున్న ఈ రైలు 662 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8.30 గంటల్లోనే చేరుకుంటుంది. ఏప్రిల్ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరనుంది. నిజానికీ రైలును ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో ప్రారంభిస్తున్నారు. అయితే, ఆ రోజున ప్రయాణికులను అనుమతించరు. ఉదయం 11.30 గంటలకు రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 9 గంటలకు తిరుపతి చేరుకుటుంది. ఒక్క మంగళవారం మాత్రం ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు. టికెట్ చార్జీలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు రైలు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మధ్యలో నల్గొండ (7.19), గుంటూరు జంక్షన్ (9.45), ఒంగోలు (11.09), నెల్లూరు (12.29) స్టేషన్లలో ఆగుతుంది.
 తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నెల్లూరు (5.20), ఒంగోలు (6.30), గుంటూరు జంక్షన్ (7.45), నల్గొండ (8.10) స్టేషన్లలో ఆగుతుంది. రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
 

More Telugu News