శ్రీరామనవమి స్పెషల్: 'రామబాణం' నుంచి డైలాగ్ టీజర్!

  • గోపీచంద్ హీరోగా 'రామబాణం'
  • అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో నడిచే కథ  
  • శ్రీవాస్ దర్శకత్వంలో ఇది మూడో సినిమా
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
Ramabanam Special Teaser Released

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో గతంలో 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలు రూపొందాయి. ఈ రెండు సినిమాలు కూడా కామెడీ టచ్ తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా విజయాలను అందుకున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడో సినిమానే 'రామబాణం'.

విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నుంచి, 'శ్రీరామనవమి' సందర్భంగా ఒక డైలాగ్ టీజర్ ను వదిలారు. 'ఆ రాముడికి లక్ష్మణుడు .. హనుమంతుడు అనే ఇద్దరు ఉంటారు. ఈ రాముడికి ఆ ఇద్దరూ నేనే' అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ హైలైట్.

ఈ టీజర్ ను బట్టి ఈ సినిమాలో జగపతిబాబు - గోపీచంద్ అన్నదమ్ములుగా కనిపించనున్నారనే విషయం అర్థమవుతోంది. అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం స్పష్టమవుతోంది. డింపుల్ హయతి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఖుష్బూ .. నాజర్ .. సచిన్ ఖేడేకర్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

More Telugu News