Siddaramaiah: డీకే శివకుమార్ తో విభేదాలు లేవు.. సీఎం రేసులో ఉన్నా: సిద్ధరామయ్య

Dont have issues with DK Shivakumar says Siddaramaiah
  • మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
  • సీఎం పదవి కోసం తనతో డీకే పోటీ పడుతున్నారన్న సిద్ధరామయ్య
  • ఎన్నికల తర్వాత సీఎం ఎవరనేది తమ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని వ్యాఖ్య
కర్ణాటక అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలయింది. మే 10న ఎన్నికలు జరగనుండగా... మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్నారు. తాజాగా మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం తనతో పాటీ పడుతున్న డీకే శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. 

తాను వంద శాతం సీఎం అభ్యర్థినేనని... అయితే ముఖ్యమంత్రి పదవి కోసం తనతో డీకే శివకుమార్ పోటీ పడుతున్నారని అన్నారు. సీఎం పదవి కోసం తనతో పోటీ పడే వారితో తనకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. డీకేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత శాసనసభా పక్ష నేతను పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ఎప్పుడూ ముందుగా ప్రకటించలేదని అన్నారు. మరోవైపు, ఇవే తన చివరి ఎన్నికలు అని సిద్ధరామయ్య చెప్పారు.
Siddaramaiah
Congress
DK Shivakumar
Karnataka
Elections

More Telugu News