West Bengal: బీజేపీకి వ్యతిరేకంగా పాట పాడిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్!

  • బెంగాల్‌ కు కేంద్రం నిధులను విడుదల చేయడం లేదంటూ 
    కోల్ కతాలో 30 గంటల నిరసన దీక్ష
  • బెంగాలీలో రాసిన పాటను పార్టీ  నాయకులతో కలిసి పాడిన దీదీ
  • బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపు
Mamata Banerjee sings Bengali song amid 30 hour sitin against Centre

కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా తమ రాష్ట్రానికి నిధులను విడుదల చేయడం లేదంటూ కోల్ కతాలో బుధవారం నుంచి 30 గంటల నిరసన దీక్ష చేపట్టారు. రెండో రోజు, గురువారం మమత బెనర్జీ తన నిరసనను ఓ పాట రూపంలో వ్యక్తం చేశారు. బెంగాలీలో రాసిన ఈ పాటను టీఎంసీ నేతలతో కలిసి ఆమె పాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కాగా, గ్రామీణ ఉపాధి హామీ పథకం సహా అనేక పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ, వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రఖ్యాత బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మమత నిరసన చేపట్టారు. బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాలన్నారు. బీజేపీ హింసించని పార్టీ ఏదీ లేదని, అందుకే అన్ని ప్రతిపక్ష పార్టీలను తాను కోరుతున్నానని మమత చెప్పారు. ఈ నిరసన దీక్ష ఈ రోజు రాత్రి 7 గంటలకు ముగియనుంది.

More Telugu News