Allari Naresh: సోనీ లివ్ .. ఈ వారం 'నిజం' టాక్ షోలో నవ్వుల సందడి!

  • సోనీ లివ్ లో సందడి చేస్తున్న 'నిజం' టాక్ షో
  • హోస్ట్ గా అలరిస్తున్న సింగర్ స్మిత 
  • అతిథిలుగా వచ్చిన అల్లరి నరేశ్ - అనిల్ రావిపూడి 
  • ఈ నెల 31వ తేదీన స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్  
Nijam Talk Show

'సోనీ లివ్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై 'నిజం' టాక్ షో తన జోరు చూపిస్తోంది. స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోలో ఈ శుక్రవారం 8వ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. హీరో అల్లరి నరేశ్ - దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది.

హాస్య కథానాయకుడిగా అల్లరి నరేశ్ కి మంచి క్రేజ్ ఉంది. చాలా వేగంగా 50 సినిమాలు పూర్తి చేసినవాడాయన. ఈ మధ్య కాలంలోనే రూట్ మార్చి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఇక హాస్య ప్రధానమైన కథలతో అనిల్ రావిపూడి వరుస విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. 

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరినీ కలిసి స్మిత ఇంటర్వ్యూ చేసిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ లో పాటల రచయిత అనంత శ్రీరామ్ .. సింగర్ రేవంత్ స్టేజ్ ను షేర్ చేసుకున్నారనే విషయం తెలుస్తోంది. ఈ నెల 31వ స్ట్రీమింగ్ అయ్యే ఈ ఎపిసోడ్ ఎంతలా కనెక్ట్ అవుతుందనేది చూడాలి. 

More Telugu News