తన కోసమే గ్రూప్-1 పేపర్ కొట్టేసిన ప్రవీణ్!

  • సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి
  • సిట్ అదుపులో ఏ1 నిందితుడు ప్రవీణ్
  • తాను కొట్టేసిన పేపర్ ను మరో ముగ్గురికి ఇచ్చిన ప్రవీణ్
TSPSC Paper Leak case details

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో ఏ1 నిందితుడు ప్రవీణ్ ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రవీణ్ తన కోసమే గ్రూప్-1 పేపర్ కొట్టేశాడని గుర్తించారు. ఆ పేపర్ ను ప్రవీణ్ టీఎస్ పీఎస్సీలోని మరో ముగ్గురు ఉద్యోగులకు ఇచ్చాడు. మొత్తమ్మీద గ్రూప్-1 పేపర్ ఐదుగురికి చేరినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. సిట్ అధికారులు ఇప్పటివరకు 84 మంది గ్రూప్-1 అభ్యర్థులను ప్రశ్నించారు. అటు, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే 12 మంది వద్దకు చేరినట్టు గుర్తించారు.

More Telugu News