హైదరాబాదులో టీడీపీ ఆవిర్భావ సభ... ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ చైతన్యరథం

  • 41 వసంతాల తెలుగుదేశం పార్టీ
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ
  • ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన చంద్రబాబు
Chandrababu attends TDP 41st foundation day meeting

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. 

అంతకుముందు ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తనయులు బాలకృష్ణ, రామకృష్ణ కూడా నివాళులు అర్పించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాగంటి బాబు, కంభంపాటి రామ్మోహన్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. 

కాగా, టీడీపీ ఆవిర్భావ సభలో నాడు ఎన్టీఆర్ ఉపయోగించిన చైతన్య రథం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పార్టీ స్థాపించిన సమయంలో ఎన్టీ రామారావు ఈ వ్యాన్ పై తిరిగే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఇప్పటికీ ఆ చైతన్య రథం చెక్కుచెదరకుండా ఉంది. టీడీపీ ఆవిర్భావ సభకు వస్తున్న కార్యకర్తలు ఆ వాహనాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

More Telugu News