కార్తీ చిదంబరంను చూసీచూడనట్టు వెళ్లిపోయిన రాహుల్ గాంధీ... బీజేపీ నేతల ఫైర్

  • పార్లమెంటు వద్ద ఘటన
  • సభలోకి వెళుతున్న రాహుల్
  • అదే సమయంలో ఎదురొచ్చిన కార్తీ చిదంబరం
  • మర్యాదకు కూడా పలకరించని రాహుల్!
  • రాహుల్ అహంకార వైఖరి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్
BJP fires on Rahul Gandhi for alleged ignoring own party MP Karti Chidambaram

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలోకి ఎంటరవుతున్న రాహుల్ గాంధీ... తనను పలకరించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంను పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది. ఊహించని ఆ పరిణామంతో కార్తీ చిదంబరం ఎంతో అవమానంగా ఫీలైనట్టు ఆయన హావభావాలను బట్టి తెలుస్తోంది. 

దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వీడియోను విష్ణువర్ధన్ రెడ్డి పంచుకున్నారు. కార్తీ చిదంబరం పట్ల రాహుల్ గాంధీ అమర్యాదకరమైన, అహంకారపూరితమైన ప్రవర్తన చాలా బాధాకరమని విష్ణు పేర్కొన్నారు. కార్తీ పరిస్థితిని అర్థం చేసుకోగలనని, ఆయనకు సానుభూతి తెలియజేసుకుంటున్నానని వివరించారు.

More Telugu News