కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్
- టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారం
- తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బండి సంజయ్, రేవంత్ లకు కేటీఆర్ నోటీసులు
- కేటీఆర్ నోటీసులను లీగల్ గానే ఎదుర్కొంటానన్న బండి సంజయ్
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్
కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. మంత్రి కేటీఆర్ పరువుకే రూ.100 కోట్లయితే, 30 లక్షల మంది యువతకు ఎంత మూల్యం చెల్లిస్తారని ప్రశ్నించారు. పేపర్ లీక్ వెనుక నా కుట్ర ఉందన్న కేటీఆర్ పై ఎంత దావా వేయాలని బండి సంజయ్ నిలదీశారు.
కేటీఆర్ ఉడుత ఊపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేసేదాకా తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసులను లీగల్ గానే ఎదుర్కొంటామని వెల్లడించారు. ప్రశ్నాపత్రాల లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు.