ఐపీఎల్ ప్రారంభోత్సవంలో తమన్నా తళుకులు

  • మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్
  • అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ
  • తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేసినట్టు ఐపీఎల్ వర్గాల వెల్లడి
  • తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
Tamannah set to perform in IPL opening ceremony

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ వచ్చేస్తోంది. మార్చి 31న ఐపీఎల్-16 ప్రారంభం కానుంది. ఎప్పట్లాగానే టోర్నీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఐపీఎల్ పాలకమండలి నిర్ణయించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో మిల్కీ బ్యూటీ తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. 

మార్చి 31న సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. ఈ ఈవెంట్ లో తమన్నాదే తొలి ప్రదర్శన కానుంది. కాగా, ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొనే ఇతర స్టార్ల వివరాలను కూడా ఐపీఎల్ వెల్లడించనుంది. ఐపీఎల్-16 ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

More Telugu News