ఒకవైపు 'స్వామి రారా 2' .. మరోవైపు 'కార్తికేయ 3'

  • నిఖిల్ క్రేజ్ ను పెంచిన 'స్వామిరారా'
  • ఆ సినిమా సీక్వెల్ కోసం మొదలైన సన్నాహాలు 
  • 'కార్తికేయ 3' కథపై దర్శకుడి కసరత్తు 
  • నిఖిల్ కోసం రెడీ అవుతున్న పెద్ద ప్రాజెక్టులు 
Nikhil Upcoming movies

నిఖిల్ ఒక ప్రాజెక్టును ఒప్పుకుంటే అప్పటి నుంచి ఆ నిర్మాతలతో .. దర్శకులతో ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు బెటర్మెంట్ తీసుకురావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఆ మధ్య ఆయన నుంచి వచ్చిన 'కార్తికేయ 2' పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ను చూసింది. నిఖిల్ కెరియర్లోనే 100 కోట్లను కొల్లగొట్టిన సినిమాగా ఇది నిలిచింది. 

ఈ నేపథ్యంలోనే నిఖిల్ తో 'స్వామి రారా 2' చేయాలనే ఉద్దేశంతో సుధీర్ వర్మ ఉన్నాడు. 'స్వామి రారా' సినిమాకి అప్పట్లో యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిఖిల్ కి 'కార్తికేయ 2'తో వచ్చిన క్రేజ్ వలన, 'స్వామి రారా 2'ను కూడా పట్టాలెక్కించాలని సుధీర్ వర్మ భావిస్తున్నాడు. కథా చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పాడు. 

ఈ నేపథ్యంలోనే 'కార్తికేయ 3' చేయడానికి దర్శకుడు చందూ మొండేటి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన కథపైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను నిర్మించాడని సిద్ధమవుతున్నారు. ఇప్పుడు నిఖిల్ చేస్తున్న సినిమాలు కాకుండా, మరో రెండు పెద్ద ప్రాజెక్టులే లైన్లో ఉన్నాయన్న మాట.

More Telugu News