health insurance: ఆరోగ్య బీమా ప్రీమియంపై డిస్కౌంట్ కావాలా..?

  • నేడు అందరికీ ఆరోగ్య బీమా కవరేజీ ఎంతో అవసరం
  • ప్రీమియం భారంగా ఉంటే తగ్గించుకునే మార్గాలున్నాయ్
  • రోజువారీ వ్యాయామాలు చేయడం ద్వారా హెల్త్ క్రెడిట్స్
  • మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా ప్రీమియంలో డిస్కౌంట్
Hefty health insurance premiums worrying you Avail these discounts to reduce cost

నేడు ఆరోగ్య బీమా అన్నది ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఎంతో అవసరం. ఉన్నట్టుండి అనారోగ్యం ఎదురుపడితే బిల్లు ఎంత వస్తుందో ఊహించలేం. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలి? అనే ప్రశ్నకు కరోనా మహమ్మారి సమాధానం చెప్పింది. అందుకే కరోనా ఉపద్రవం తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అయినా, ఇప్పటికీ చాలా మంది బీమాకు దూరంగానే ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాస్త ఎక్కువే ఉంటుంది. కనుక ప్రీమియంపై డిస్కౌంట్ పొందేందుకు పలు మార్గాలును ఆశ్రయించొచ్చు.


జీవనశైలి
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించిన వారికి బీమా సంస్థలు ప్రత్యేక రివార్డులను ఇస్తున్నాయి. రెన్యువల్ ప్రీమియంలో ఇంత శాతం చొప్పున తగ్గింపు ఇస్తున్నాయి. రోజూ కొన్ని వేల అడుగుల పాటు నడిస్తే హెల్త్ క్రెడిట్స్ ఇస్తున్నాయి. జిమ్ లో వ్యాయామాలు చేసినా సరే క్రెడిట్స్ పొందొచ్చు. ఈ క్రెడిట్స్ తో ప్రీమియంను 30 శాతం వరకు తగ్గించుకోవచ్చు. పొగతాగే వారితో పోలిస్తే పాగతాగని వారికి ప్రీమియం 25 శాతం తక్కువగా ఉంటుంది. 

బోనస్
నో క్లెయిమ్ బోనస్ కింద కొన్ని బీమా సంస్థలు ప్రీమియంలో తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. అదే సంస్థ వద్ద రెన్యువల్ చేసుకునే వారికి కొంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. 

వెయిటింగ్ పీరియడ్
ముందు నుంచి ఉన్న వ్యాధులకు అన్ని బీమా సంస్థలు వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తున్నాయి. అది పూర్తయిన తర్వాతే ఆ వ్యాధులకు కవరేజీ వస్తుంది. ముందుగా ఎలాంటి వ్యాధులు లేని వారు, అధిక వెయిటింగ్ పీరియడ్ ను ఎంపిక చేసుకోవడం ఒక మార్గం. దీని వల్ల ప్రీమయింలో 4-5 శాతం డిస్కౌంట్ వస్తుంది. 

క్రెడిట్ స్కోర్
మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా ప్రీమియం భారం తగ్గుతుంది. కనీసం 750కి పైన క్రెడిట్ స్కోర్ ఉండాలి. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సహా పలు కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. 5-10 శాతం వరకు ప్రీమియం తగ్గుతుంది.

More Telugu News