Jagan: కోనసీమ అల్లర్ల కేసుల విషయంలో జగన్ కీలక నిర్ణయం

  • కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో చెలరేగిన అల్లర్లు
  • కేసులు ఎత్తివేయాలని జగన్ నిర్ణయం
  • అందరూ కలిసిమెలిసి ఉండాలనే యోచనతోనే నిర్ణయం తీసుకున్నామన్న సీఎం
Jagan decides to lift cases of Amalapuram riots

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో అమలాపురంలో భారీ హింస చెలరేగిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు విశ్వరూప్, పొన్నాడ సతీశ్ ల ఇళ్లకు కూడా దుండగులు నిప్పు పెట్టారు. రాళ్ల దాడులు, బస్సుల దహనం వంటివి కూడా చోటు చేసుకున్నాయి. దీంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. 

ఈ క్రమంలో తాజాగా ఈ కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులపై కేసులు ఎత్తి వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో జరిగిన ఘటనను అందరూ మరిచిపోయి, కలిసిమెలిసి ఉండాలనే యోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు కేసులను ఎత్తి వేయాలనే నిర్ణయం తీసుకున్న జగన్ కు కోనసీమ నేతలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

More Telugu News