రేపే 'మీటర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్!

  • కిరణ్ అబ్బవరం తాజా చిత్రంగా 'మీటర్'
  • కథానాయికగా అతుల్య రవి పరిచయం
  • సంగీతాన్ని అందించిన సాయికార్తీక్ 
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా రిలీజ్
Meter movie update

కిరణ్ అబ్బవరం నుంచి ఇటీవల వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ ను కిరణ్ ఎంజాయ్ చేస్తుండగానే, ఆయన మరో సినిమా 'మీటర్' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో కిరణ్ జోడీగా 'అతుల్య రవి' పరిచయమవుతోంది. 

మైత్రీ - క్లాప్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించాయి. రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సాయికార్తీక్ సంగీతాన్ని అందించాడు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. 

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి రేపు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. AMB సినిమాస్ లో స్క్రీన్ నెంబర్ 6లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోసాని .. సప్తగిరి .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News