ప్రజల సొమ్ము ‘కోవిందా.. కోవిందా..’: కేంద్రంపై ప్రకాశ్ రాజ్ సెటైర్ !

  • కేంద్రం టార్గెట్ గా తరచూ విమర్శలు చేస్తున్న ప్రకాశ్ రాజ్
  • పులుల సంరక్షణ నిధులను కోవింద్ పర్యటన కోసం వాడినట్లు ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్త
  • కథనం క్లిప్పింగ్ ను షేర్ చేస్తూ సెటైరికల్ వ్యాఖ్యలు
Prakash Raj made satirical comments on the Centre

కేంద్ర ప్రభుత్వంపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తుంటారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. లలిత్ మోదీ, నరేంద్ర మోదీ, నీరవ్ మోదీల ఫొటోలు ట్విట్టర్ లో షేర్ చేసి.. కామన్ గా ఉన్నదేంటో చెప్పాలని క్యాప్షన్ ఇచ్చారు.

తాజాగా కేంద్రం టార్గెట్ గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్తను షేర్ చేశారు. పులుల సంరక్షణ కోసం కేటాయించిన నిధులను మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ టూర్ సందర్భంగా ఉపయోగించినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైందని ఆ కథనంలో పేర్కొన్నారు. సుమారు 1.1 కోట్లను ఆయన పర్యటనలో ఖర్చు చేసినట్లు అందులో వివరించారు.

దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. ‘‘ప్రజల సొమ్ము కోవిందా.. కోవిందా’’ అంటూ ఇంగ్లిష్, కన్నడలో కామెంట్ చేశారు. ‘కోవింద్’ అని అర్థం వచ్చేలా ఎద్దేవా చేశారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అని హాష్ ట్యాగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News