వాడు క్రిమినల్ లాయర్ కాదు .. లా చదివిన క్రిమినల్: 'రావణాసుర' ట్రైలర్ డైలాగ్!

  • సుధీర్ వర్మ దర్శకుడిగా 'రావణాసుర'
  • తన ఇమేజ్ కి భిన్నమైన పాత్రలో రవితేజ 
  • ఆయన సరసన ఐదుగురు నాయికలు
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదల
Ravanasura trailer released

రవితేజ తెరపై కనిపిస్తే ఓ సరదా .. ఓ సందడి. అలాంటి రవితేజ కాస్త వైలెంట్ గా కనిపిస్తే ఒకింత ఆశ్చర్యానికి లోను కావడం సహజమే. అలా తన స్టయిల్ కి భిన్నంగా నెగెటివ్ షేడ్స్ తో ఆయన చేసిన సినిమానే 'రావణాసుర'. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. 

అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 7వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. యాక్షన్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 'వాడు క్రిమినల్ లాయర్ కాదు .. లా చదివిన క్రిమినల్' అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్.  

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. పూజిత పొన్నాడ కథానాయికలుగా అలరించనున్నారు. రావు రమేశ్ .. సంపత్ రాజ్ .. మురళీ శర్మ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News