పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ కొడుకుతో అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడికి సంబంధాలు

  • ఖలిస్థాన్ వేర్పాటువాద మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట
  • అమృత్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు దల్జిత్
  • దల్జిత్ కు పాక్ ఆర్మీ మాజీ చీఫ్ జావెద్ బజ్వా కుమారుడితో సన్నిహిత సంబంధాలు
Khalistan Amrithpal Singh have contacts with Pakistan Army ex chief

దేశ వ్యాప్తంగా ఇప్పుడు మారుమోగుతున్న పేరు అమృత్ పాల్ సింగ్. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత అయిన ఈయన గురించి వేట కొనసాగుతోంది. అమృత్ సింగ్ కు పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ కొడుకుతో సంబంధాలు ఉన్నాయనే విషయం బయటపడింది. అమృత్ సింగ్ ఫైనాన్సియర్ దల్జిత్ కు పాక్ మాజీ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా కుమారుడితో చాలా సాన్నిహిత్యం ఉంది. దల్జిత్ దుబాయ్ లో ఉంటున్నాడు. దల్జిత్ కొంత కాలం క్రితం ఢిల్లీలో ఆఫీస్ ను ఏర్పాటు చేశాడు. పంజాబ్ సినిమాలు, మోడలింగ్ కు సంబంధించి కాంట్రాక్టులను నిర్వహిస్తున్నాడు. ఈయన అమృత్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు. 

అమృత్ పాల్ సింగ్ పై ఇంటెలిజెన్స్ అధికారుల వద్ద కీలక సమాచారం ఉంది. 30 ఏళ్ల అమృత్ సింగ్ పాక్ కు చెందిన ఐఎస్ఐ సహకారంతో ఇండియాలోకి ఆయుధాలను ఇల్లీగల్ గా తరలిస్తున్నాడు. ఖలిస్థాన్ వేర్పాటు వాద నేత, టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్ భింద్రన్ వాలేకు అమృత్ అనుచరుడు. ఆయనను భింద్రన్ వాలే 2.0 అని కూడా పిలుస్తుంటారు.

More Telugu News