bellamkonda srinivas: కేజీఎఫ్ ను దాటిన బెల్లంకొండ సినిమా.. యూట్యూబ్ లో ప్రపంచ రికార్డు

bellamkonda srinivas movie jaya janaki nayaka create world record in youtube
  • ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా ‘జయ జానకీ నాయక’ హిందీ వర్షన్
  • 709 మిలియన్ వ్యూస్ రాబట్టిన చిత్రం
  • 702 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో కేజీఎఫ్
జయ జానకీ నాయక.. మాస్ దర్శకుడు బోయపాటి తీసిన సినిమా ఇది. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. 2017 ఆగస్టులో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 

నిజానికి ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. విడుదలయ్యాక మిశ్రమ స్పందన వచ్చింది. కానీ హిందీ వర్షన్ మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 709 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 702 మిలియన్ వ్యూస్ తో కేజీఎఫ్ రెండో స్థానంలో నిలిచింది. తెలుగులో పెద్దగా ఆడని సినిమాతో పోలిస్తే వందల కోట్లు రాబట్టిన కేజీఎఫ్ వెనుకపడటం గమనార్హం.

బెల్లంకొండ శ్రీనివాస్‌కు నార్త్‌లో మంచి క్రేజే ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌లకు మిలియన్లలో వ్యూస్‌ వచ్చాయి. సీత, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలకు వందల మిలియన్లలో వ్యూస్‌ సాధించాయి. ఈ క్రేజ్ నేపథ్యంలోనే నేరుగా బాలీవుడ్ లోకి శ్రీనివాస్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఛత్రపతి రీమేక్‌తో హిందీలో డెబ్యూ ఇస్తున్నాడు. ఇటీవలే రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ సినిమా సమ్మర్‌ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
bellamkonda srinivas
jaya janaki nayaka
world record in youtube
KGF

More Telugu News