venu swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!

nidhi agarwal performed puja at home with astrologer venu swamy
  • టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాప్యులరైన వేణు స్వామి
  • సినిమా ఇండ‌స్ట్రీలో మంచి అవ‌కాశాలు కోసం నిధి అగర్వాల్ పూజలు!
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో పాప్యులర్ అయ్యారు వేణు స్వామి. ఆయన తాజాగా మరోసారి వార్త‌ల్లో నిలిచారు. హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ ఇంట్లో పూజ‌లు, యాగం చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

కెరీర్ స‌జావుగా సాగేందుకు, సినిమా ఇండ‌స్ట్రీలో మంచి అవ‌కాశాల కోసం నిధి అగర్వాల్ పూజలు చేసింది. వేణుస్వామితో కలిసి తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు, యాగం నిర్వహించింది. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ తదితర చిత్రాల్లో నటించిన నిధి అగర్వాల్ కు ఇటీవల సినిమా అవకాశాలు నెమ్మదించాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’లో ఆమె నటిస్తోంది. 

ఇక, వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వేణు స్వామి ఫేమస్ అయ్యారు. స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకుల‌ గురించి ముందే చెప్పారు. అప్పట్లో ఆయనపై విమర్శలు వచ్చినా.. చెప్పింది నిజం కావడంతో బాగా పాప్యులర్ అయ్యారు. మరికొందరు ప్రముఖుల జీవితాల‌పై వేణుస్వామి చెప్పిన కొన్ని విష‌యాలు స‌రిగ్గా జ‌రిగాయి.

దాంతో ఆయన మాట‌ల‌పై చాలా మందికి న‌మ్మకం కుదిరింది. గ‌త కొంతకాలంగా టాలీవుడ్ ప్రముఖులు వేణుస్వామి చుట్టూ చ‌క్కర్లు కొడుతున్నారని సమాచారం. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న కూడా వేణుస్వామితో పూజలు చేయించినట్లు వార్తలు వచ్చాయి.
venu swamy
nidhi agarwal
puja at home
Tollywood

More Telugu News