Cosmic procession: నేడు ఆకాశంలో ఐదు గ్రహాలను చూడచ్చు.. వరుస క్రమం ఇలా..!

Cosmic procession How to watch rare alignment of 5 planets in night sky this week
  • సూర్యాస్తమయం ముగిసిన వెంటనే చూడాలి
  • పశ్చిమదిశలో ఒకే సమాంతర రేఖపైకి ఐదు నక్షత్రాలు
  • గురుడు, శుక్రుడు, అంగారకుడిని కళ్లతో చూడొచ్చు
  • మిగిలిన రెండింటిని చూడాలంటే బైనాక్యులర్ అవసరం
నేడు సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ఐదు గ్రహాలు కనువిందు చేయనున్నాయి. కాకపోతే ఇందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాల్సిందే. ఐదింటలోనూ మూడింటిని నేరుగా కళ్లతో చూడొచ్చు. రెండింటిని బైనాక్యులర్ తోనే చూడగలరు. 

సరైన సమయం
సూర్యస్తమయం అయిన వెంటనే పశ్చిమం వైపు చూడాలి. ఐదు గ్రహాలూ సమాంతర రేఖలో కనిపిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే సూర్యాస్తమయం ముగిసిన అరగంట తర్వాత బుధగ్రహం, గురుడు సమాంతర రేఖ నుంచి కొంచెం కిందకు వస్తారు. ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే భూమిపై ఎక్కడి  నుంచైనా వీటిని చూడొచ్చు. 

గురుడు, శుక్రుడు, అంగారకుడిని కళ్లతో చూడొచ్చు. ఇవి కొంచెం ప్రకాశవంతంగా కనిపిస్తాయి. సమాంతర రేఖలో అన్నింటికంటే దిగువన ఉన్నది బుధగ్రహం. తర్వాత ఉన్నది శుక్రుడు. దానిపైన, చంద్రుడికి దిగువన ఉన్నది యురేనస్. తర్వాత చంద్రుడు. చంద్రుడికి ఎగువ భాగంలో తొలుత మార్స్ ఉంటుంది. అన్నింటికంటే పైన గురుగ్రహం కనిపిస్తుంది. సాధారణంగా మిగిలిన గ్రహాలు అప్పుడప్పుడు దర్శనమిచ్చినా, యురేనస్ కనిపించడం అరుదు. ఈ ఏడాది జూన్ లోనూ ఇదే మాదిరి దృశ్యం కనిపించనుంది. కాకపోతే ప్రతిసారీ ఇవే ఐదు గ్రహాలు ఉండవు.
Cosmic procession
5 planets
night sky
after sunset

More Telugu News