Leopard: ఈ చిరుత సూర్యనమస్కారాలు చేస్తోంది.. వీడియో ఇదిగో!

Leopard Performing Surya Namaskar Delights Internet Viral Video
  • సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
  • వీడియోను చూసి ఆశ్చర్యపోతున్న ట్విట్టర్ యూజర్లు
  • కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
సుశాంత నందా.. సోషల్ మీడియా యూజర్లకు ఈ పేరు చిరపరిచితం. వన్యప్రాణులకు సంబంధించి ఎవరూ ఊహించని వీడియోలను షేర్ చేస్తూ వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంచడంతోపాటు అవగాహన కల్పిస్తున్న ఐఎఫ్ఎస్ అధికారి ఆయన. తాజాగా, ఆయన షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాను మెస్మరైజ్ చేస్తోంది. 

యోగాలో భాగమైన సూర్య నమస్కారాలు చేయడం మనకు అలవాటైన పనే. కానీ, ఓ చిరుత ఆ పనిచేస్తే.. ఆశ్చర్యంగా, నమ్మశక్యం కాకుండా ఉంది కదూ! అయినా ఇది నిజం. అడవిలోని ఓ చిరుత ఉదయం నిద్రలేస్తూనే సూర్యనమస్కారాలు చేయడం సుశాంత్ నందా షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. ‘సూర్యనమస్కారం చేస్తున్న చిరుత’ అని ఆ వీడియోకు ఆయన కేప్షన్ తగిలించారు. 

నిన్న ఈ వీడియో షేర్ చేయగా, ఇప్పటికే లక్షకుపైగా వ్యూస్, 2,500 లైకులు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ‘వాటికెవరు యోగా నేర్పిస్తున్నారు? యోగా టీచర్ లేరు, యూట్యూబ్ లేదు, పుస్తకాలు లేవు?’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

‘విచిత్రంగా ఉంది’ అని మరో యూజర్ కామెంట్ చేస్తే.. దాని ఫిట్‌నెస్ రహస్యం అదేనని ఇంకో యూజర్ కామెంట్ చేశాడు. తమ కుక్క కూడా ఇలానే చేస్తుందని, కానీ అది సూర్యనమస్కారం కాదని, వేటకు వెళ్లేందుకు బద్దకాన్ని వదిలించుకుంటుందని ఇంకో యూజర్ రాసుకొచ్చాడు.
Leopard
Suryanamaskar
Susanta Nanda

More Telugu News