కాస్టింగ్ కౌచ్ అనుభవం తనకు కూడా ఎదురైందన్న టాలీవుడ్ విలన్

  • ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న రవి కిషన్
  • ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ తనను కాఫీకి పిలిచిందని వెల్లడి
  • రాత్రి వేళ కాఫీకి పిలవడంతో తనకు విషయం అర్థమైందన్న నటుడు
  • దాంతో ఆమెకు నో చెప్పానని వివరణ
Tollywood villain Ravi Kishan reveals his casting couch experience

సినిమాల్లో నటించాలని వచ్చే అమ్మాయిలను కాస్టింగ్ కౌచ్ పేరిట కమిట్ మెంట్ అడగడం కొత్తేమీ కాదు. గతంలో నటీమణులపై లైంగిక వేధింపులకు సంబంధించి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. పేరుమోసిన హీరోయిన్లు కూడా తాము కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. 

అయితే, ఓ నటుడు తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని చెప్పడం ఆశ్చర్యం కలిగించకమానదు. ఆ నటుడు రవి కిషన్. అల్లు అర్జున్ హిట్ చిత్రం రేసుగుర్రం చిత్రంలో రవికిషన్ విలన్ గా నటించాడు. 

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెరీర్ కొత్తలో ఇండస్ట్రీలో ఉన్న ఒక మహిళ తనను రాత్రి వేళ కాఫీ తాగుదాం రమ్మని పిలిచిందని వెల్లడించాడు. ఉదయం, మధ్యాహ్నం కాకుండా, రాత్రి సమయంలో కాఫీ అనే సరికి సందేహం వచ్చిందని, ఆ తర్వాత ఆమె మనసులో ఏముందో అర్థమైందని రవి కిషన్ వివరించాడు. దాంతో తాను నో చెప్పానని వెల్లడించాడు.

ఆమె పేరు బయటపెట్టలేనని, ఇప్పుడామె ఇండస్ట్రీలో ఉన్నత స్థాయిలో ఉందని చెప్పాడు. ఆమె ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన వ్యక్తి అని పేర్కొన్నాడు. అవకాశాల కోసం తప్పుడు మార్గాల్లో వెళ్లకూడదని తాను ముందే నిర్ణయించుకున్నానని, టాలెంట్ ఉంటే తప్పకుండా పైకి వస్తామన్నది తన నమ్మకం అని రవి కిషన్ వెల్లడించాడు.

More Telugu News