AAP: బాలీవుడ్ నటితో డేటింగ్ చేస్తున్న ఎంపీని ఆటపట్టించిన రాజ్యసభ చైర్మన్

VP Dhankhar teases AAP leader Raghav Chadha over dating rumours with Parineeti Chopra
  • ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రేమలో ఉన్నట్టు ప్రచారం
  • పలుమార్లు జంటగా కనిపించిన పరిణీతి, రాఘవ్
  • పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్ లో ఉన్నారని అటు బాలీవుడ్ లో.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరూ పలుమార్లు జంటగా బయట కనిపించారు. దాంతో, ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం భారత పార్లమెంట్ ను కూడా చేరింది. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంకర్ ఆప్ నాయకుడు రాఘవ్ చద్దాను ఆటపట్టించారు. 

మెహుల్ చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వానికి ప్రభుత్వం ఎన్వోసీ గురించి చర్చించడానికి రాఘవ్ చద్దా రాజ్యసభలో బిజినెస్ సస్పెన్షన్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసు గురించి సభలో చెప్పిన చైర్మన్ దంఖర్ ‘మీరు ఇప్పటికే సోషల్ మీడియాలో తగినంత స్థలాన్ని ఆక్రమించారు’ అని ఆటపట్టించడంతో సభలో ఎంపీలంతా నవ్వుకున్నారు. 

కాగా, పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా కొన్ని రోజుల క్రితం డిన్నర్ డేట్ కి వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయం గురించి మీడియా ప్రతినిధులు రాఘవ్ ని ప్రశ్నించారు. దీనికి ‘నన్ను రాజకీయాల గురించి అడగండి, పరిణీతి గురించి కాదు’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కాగా, రాఘవ్ తన ట్విట్టర్లో 44 మందిని ఫాలో అవుతున్నాడు, ఇందులో బాలీవుడ్ నుంచి ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన గుల్ పనాగ్ కాగా, మరొకరు పరిణీతి చోప్రా.
AAP
mp
Raghav Chadha
Parineeti Chopra
Vice president
VP Dhankhar

More Telugu News