MS Dhoni: స్టేడియంలో కుర్చీలకు శ్రద్ధగా పెయింటింగ్ వేసిన ధోనీ.. వీడియో ఇదిగో

  • కరోనా తర్వాత తొలిసారి చెన్నైలో ఆడబోతున్న సీఎస్కే
  • చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ అండ్ కో
  • ఈ నెల 31వ తేదీ నుంచి ఐపీఎల్ 2023
MS Dhoni enjoys spray painting chairs at Chepauk as stadium gears up for return to action

ఈ సీజన్ తో తన ఐపీఎల్ కెరీర్ కు ముగింపు ఇవ్వాలని అనుకుంటున్న భారత లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ను మరోసారి విజేతగా నిలపాలని ఆశిస్తున్నాడు. కరోనా తర్వాత తొలిసారి చెన్నైలో సొంత అభిమానుల సమక్షంలో ధోనీ బరిలోకి దిగబోతున్నాడు. ఇందుకోసం చెపాక్ స్టేడియంలో నెల నుంచే ధోనీ, సీఎస్కే క్రికెటర్లు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. పగలు, రాత్రి ట్రెయినింగ్ లో పాల్గొంటున్న ధోనీ సహచరులతో సరదాగా కూడా గడుతుపున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం స్టేడియంలోని కుర్చీలకు పెయింటింగ్ వేస్తూ కనిపించాడు. 

చెపాక్ స్టేడియాన్ని ఈ మధ్యే పునరుద్ధరించారు. అలాగే చాలా ఏళ్ల తర్వాత ఐ,జే,కే స్టాండ్లను కూడా ఉపయోగంలోకి తెచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్ లో అభిమానులను ఈ స్టాండ్లలోకి అనుమతించనున్నారు. ఈ క్రమంలో స్టాండ్స్ లోని కుర్చీలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్‌లతో బయటికి వచ్చి చెపాక్‌లో రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్కే తమ ట్విట్టర్ లో షేర్ చేసింది. కాగా, ఐపీఎల్ ఈనెల 31న మొదలవనుంది. సీఎస్కే జట్టు ఈ సీజన్ లో తమ సొంతనగరంలో తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 3న లక్నోతో తలపడనుంది.

More Telugu News