హిందీ ఛత్రపతి.. బెల్లకొండ శ్రీనివాస్ లుక్ అదుర్స్

  • వినాయక్ దర్శకత్వంలో హిందీ ఛత్రపతి 
  •  మే 12న విడుదల కాబోతున్న చిత్రం
  • ఈ చిత్రంతో శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ
Hindi Chatrapathi in cinemas on 12th May 2023

‘ఛత్రపతి’.. ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ కు మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. 18 ఏళ్ల కిందట టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్‌ హిందీలో తెరంగేట్రం చేస్తున్నాడు.  వి.వి. వినాయక్‌ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ విడుదల తేదీని ప్రకటించారు. ఒరిజినల్‌ టైటిల్‌ నే కొనసాగిస్తున్నారు. వేసవి కానుకగా మే 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ కండలు తిరిగిన దేహంతో చేతిలో చెంబు పట్టుకుని సముద్రం వైపు తిరిగి ఉన్నాడు. ఈ సినిమాను పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై జయంతి లాల్‌ నిర్మిస్తున్నాడు.

More Telugu News