Planetary parade: 28న రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఒకేసారి ఐదు గ్రహాలు

Planetary parade 5 planets to be visible in the night sky in a rare alignment
  • గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు దర్శనం
  • వీటిలో రెండింటిని చూడాలంటే బైనాక్యులర్ అవసరం
  • సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు కనువిందు
ఆకాశంలో అరుదైన, అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 28న రాత్రి నింగి వైపు తప్పకుండా ఒక్కసారి చూడండి. వీలుంటే మంచి పవర్ ఫుల్ బైనాక్యులర్ కూడా రెడీగా ఉంచుకోండి. ఐదు గ్రహాలు ఒకే రోజు దర్శనం ఇవ్వనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు సమీపానికి రానున్నారు. వీటికి చంద్రుడు అదనం.

‘‘సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు చూడాలి. 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి. ఇందులో గురుడు, శుక్రుడు, అంగారకుడిని మన కళ్లతోనే చూడొచ్చు. బుధగ్రహం, యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూడగలరు’’ అని నాసాకు చెందిన బిల్ కూక్ సూచించారు. 2022 జూన్ లోనూ ఇలాంటి అద్భుతమే ఒకటి కనిపించింది. నాడు బుధగ్రహం, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని ఒకే లేఖనంపైకి వచ్చాయి. అమెరికా మాజీ ఖళోగ శాస్త్రవేత్త, చంద్రుడిపై నడిచిన తొలి వ్యొమగాముల్లో ఒకరైన డాక్టర్ బజ్ ఆల్డ్రిన్ కూడా 28న రాత్రి ఆకాశం వైపు చూడాలని సూచించారు.
Planetary parade
5 planets
visible
night sky

More Telugu News