USA: అమెరికాలోని సిక్కు గురుద్వారాలో కాల్పులు

Gun fire in USA Gurudwara
  • కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీలో కాల్పులు
  • ఒకరికొకరు తెలిసిన వారి మధ్యే ఫైరింగ్
  • ఇద్దరి పరిస్థితి విషమం
అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీలో ఉన్న సిక్కు గురుద్వారా కాల్పులతో దద్దరిల్లింది. నిన్న 2.30 గంటల సమయంలో తుపాకీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తుల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనపై ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. మత విద్వేషాల కారణంగా ఈ కాల్పులు జరగలేదని... ఒకరికొకరు బాగా తెలిసిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందని... పాత వివాదాలే ఈ ఘటనకు కారణమని చెప్పారు. 

ఈ మొత్తం ఘటనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు స్నేహితులు కాగా... మరొకరు ప్రత్యర్థి. వీరు ముగ్గురూ ఒకరికొకరు తెలుసు. గాయపడిన ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత ఏడాది అమెరికాలో తుపాకీ కాల్పుల కారణంగా దాదాపు 44 వేల మంది మృతి చెందారని గణాంకాలు చెపుతున్నాయి. వీటిలో హత్యలు, ఆత్మహత్యలు, సెల్ఫ్ డిఫెన్స్ సమయంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయి.   

USA
Gurudwara
Firing

More Telugu News