ఏప్రిల్ 8న మోదీ హైదరాబాద్ రాక... తిరుపతి వందేభారత్ రైలుకు ప్రారంభోత్సవం

  • హైదరాబాదులో మోదీ పర్యటన
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన 
  • ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు
  • తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్ రైలు
PM Modi will visit Hyderabad on April 8

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ఓ వందేభారత్ రైలు నడుస్తున్న సంగతి తెలిసిందే. 

సికింద్రాబాద్-విశాఖ మధ్య ఈ రైలు నడుస్తోంది. ఇప్పుడు సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు వస్తోంది. కాగా, ఈ రైలు ఆగే స్టేషన్లు, సమయాలు, చార్జీల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

More Telugu News