నేడు రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు... ఆర్సీ15 నుంచి ఫ్యాన్స్ కు డ‌బుల్ ధ‌మాకా!

  • మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు
  • శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15లో నటిస్తున్న రామ్ చరణ్
  • రెండు అప్ డేట్లు ఇచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు
  • గత కొన్నిరోజుల ముందు నుంచే పుట్టినరోజు వేడుకలు
  • ఇటీవలే ఆర్సీ15 సెట్ పై కేక్ కట్ చేసిన గ్లోబల్ స్టార్
RC 15 unit gives double treat to fans on Ram Charan birthday

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నేడు (మార్చి 27) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. గత కొన్నిరోజుల ముందు నుంచే అభిమానులు పుట్టిన‌రోజు వేడుక‌లు షురూ చేశారు. రామ్ చరణ్ ఇప్పటికే ఆర్సీ 15 సెట్లో పుట్టిన‌రోజు సంబ‌రాల‌ను కేట్ క‌ట్ చేసి ప్రారంభించారు. ఆ జోష్‌ని కంటిన్యూ చేస్తూ, చిత్రబృందం రామ్‌చ‌ర‌ణ్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఫ్యాన్స్ కి మ‌రో రెండు స‌ర్‌ప్రైజ్ గిఫ్టుల‌ను అందిస్తోంది. 

అభిమానులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న టైటిల్ రివీల్ చేయాల‌ని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దీంతో పాటు డ‌బుల్ ధ‌మాకాగా ఫ‌స్ట్ లుక్‌ని కూడా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇవాళ ఉద‌యం 8.19 కి ఓ అప్‌డేట్‌, మ‌ధ్యాహ్నం 3.06కి మ‌రో అప్‌డేట్‌తో అభిమానుల‌ను ఆనందంలో ముంచెత్తనున్నారు. 

ఆర్సీ 15 సినిమాను శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ ప్రతిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. దిల్‌రాజు నిర్మాణంలో స్టార్ డైరెక్టర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఈ సినిమాలో కియారా అద్వానీ న‌టిస్తున్నారు.

More Telugu News