ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు నాలుగో స్వర్ణం

  • 75 కిలోల కేటగిరీలో లవ్లీనా బోర్గోహైన్ కు స్వర్ణం
  • ఫైనల్ బౌట్లో ఆసీస్ బాక్సర్ పై విజయం
  • ఇప్పటికే స్వర్ణాలు గెలిచిన నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా, నిఖత్ జరీన్
  • ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ జోరు 
Lovlina Borgohain wins World Boxing Championship gold for India

ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు నాలుగో స్వర్ణం లభించింది. 75 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ పసిడి పతకం సాధించింది. ఇవాళ జరిగిన టైటిల్ బౌట్లో లవ్లీనా ఆస్ట్రేలియా బాక్సర్ కైట్లిన్ పార్కర్ ను ఓడించింది. తొలి రౌండ్ ను లవ్లీనా చేజిక్కించుకోగా, రెండో రౌండ్ లో పార్కర్ పుంజుకుంది. ఆ తర్వాత వరుసగా మూడు రౌండ్లలోనూ  లవ్లీనా ఆధిపత్యం కొనసాగింది. ఈ ఫైనల్ బౌట్ ను లవ్లీనా 4-1తో గెలిచి భారత్ కు స్వర్ణం అందించింది. 

ఈ చాంపియన్ షిప్ లో ఇప్పటికే నీతూ ఘంఘాస్ (48 కిలోలు), స్వీటీ బూరా (81 కిలోలు), నిఖత్ జరీన్ (50 కిలోలు) పసిడి పతకాలు గెలిచారు. 2006 నుంచి ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లలో భారత్ కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

More Telugu News