తనని తక్కువచేసి మాట్లాడిన బాలీవుడ్ కి చరణ్ సమాధానమిచ్చాడు: నాగబాబు

  • అభిమానుల సమక్షంలో చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ 
  • చరణ్ సాధించిన పరిణతిని గురించి ప్రస్తావించిన నాగబాబు 
  • ఆయన సినిమా ఆస్కార్ వరకూ వెళ్లడం పట్ల హర్షం 
  • 'ఆరెంజ్' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని వ్యాఖ్య

Ram Charan Biirthday Celebrations

రామ్ చరణ్ బర్త్ డే రేపు. ఈ నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే అభిమానుల హడావిడి .. సందడి మొదలైంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సీడీపీకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీ రిలీజ్ చేసిన 'ఆరెంజ్' సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో ఈ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. 
 
ఈ వేదికపై నాగబాబు మాట్లాడుతూ .. ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం మెగా ఫ్యామిలీ దక్కించుకున్న అదృష్టం. చరణ్ లో చిన్నప్ప్పుడు కాస్త కోపం ఎక్కువగా ఉండేది. వయసుతో పాటు అతనిలో మెచ్యూరిటీ కనిపిస్తూ వచ్చింది. గతంలో మా అందరికీ అన్నయ్య పెద్ద దిక్కు అయితే, ఇప్పుడు మా అందరి పిల్లల పట్ల చరణ్ అలాగే ఉంటాడు. వాళ్లకి సరైన గైడెన్స్ ఇస్తూ వెళుతుంటాడు. ఇలాంటి కొడుకు ఇంటికి ఒకడుంటే బాగుండునని అనుకునేలా చరణ్ ఎదగడం సంతోషంగా ఉంది" అన్నారు. 

'ఆర్ ఆర్ ఆర్' పాటకు ఆస్కార్ తెరపై దక్కిన గౌరవం గురించి తెలిసిందే. అందులో చరణ్ కూడా ఉండటం సంతోషించదగిన విషయం. తనని తక్కువ చేసి మాట్లాడిన బాలీవుడ్, తనవైపు తిరిగి చూసేలా చరణ్ ఎదగడం గర్వంగా ఉంది. చరణ్ హీరోగా నేను గతంలో చేసిన 'ఆరెంజ్' సినిమా సరిగ్గా ఆడలేదు. ఈ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసి ఆ సినిమా వలన వచ్చిన డబ్బును 'జనసేన' పార్టీకి ఇచ్చాను. రెండు రోజుల్లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి సూపర్ హిట్ అనిపించుకుంది. ఇలా రెండు విధాలుగా నాకు చాలా ఆనందంగా ఉంది " అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News