Bonda Uma: రాపాక వరప్రసాద్ తాడేపల్లి స్క్రిప్టును చదివారు: బొండా ఉమ

  • ఇటీవల ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఓటు కోసం టీడీపీ తనకు ఆఫర్ ఇచ్చిందన్న రాపాక
  • రాపాక ఓ చిల్లర మనిషి అంటూ బొండా ఉమ కౌంటర్
  • జనసేనలో గెలిచి వైసీపీకి ఎప్పుడో అమ్ముడుపోయాడని విమర్శలు
  • ఇవాళ నీతులు చెబుతున్నాడని ఆగ్రహం 
Bonda Uma counters Rapaka Varaprasad comments

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటేయాలంటూ తనకు ఆఫర్ అందిందని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ స్పందించారు. 

రాపాక వరప్రసాద్ తాడేపల్లి స్క్రిప్టునే చదివారని విమర్శించారు. రాపాక ఓ చిల్లర మనిషి అని, జనసేనలో గెలిచి వైసీపీకి అమ్ముడుపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఇవాళ నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. 

రాపాకను కొనాల్సిన అవసరం టీడీపీకి లేదని స్పష్టం చేశారు. టీడీపీకి కావాల్సిన 23 ఓట్లు స్పష్టంగా ఉన్నాయని బొండా ఉమ పేర్కొన్నారు. అసలు, రాపాకను రూ.10 కోట్లు పెట్టి కొనేది ఎవరని, అతడికి రూ.10 వేలు కూడా ఎక్కువేనని ఎద్దేవా చేశారు. 

"రాపాక వరప్రసాద్ ఇప్పటికే అమ్ముడుపోయిన సరుకు... నిన్ను ఆల్రెడీ కొనేశారు నాయనా... ఈ ప్రాపర్టీ వైసీపీకి చెందుతుంది" అంటూ బొండా ఉమ ఎద్దేవా చేశారు. "నువ్వు గానీ, నీలాంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ టీడీపీకి ఎందుకు... దీనిపై సూటిగా సమాధానం చెప్పు" అని రాపాకను నిలదీశారు.

More Telugu News