మహేశ్ బాబు-త్రివిక్రమ్ చిత్రం రిలీజ్ డేట్ వచ్చేసింది!

  • ఎస్ఎస్ఎంబీ28 వర్కింగ్ టైటిల్ తో కొత్త చిత్రం
  • వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్
  • 2024 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
  • శ్రీరామనవమి సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలు
Mahesh Babu new movie with Trivikram will be released on 2024 January 13

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా 2024 సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. ఎస్ఎస్ఎంబీ28 అనే వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసింది. దమ్ము లాగుతూ మాంచి క్రిస్పీ లుక్ తో ఉన్న మహేశ్ బాబును ఈ పోస్టర్ లో చూడొచ్చు. 

కాగా, శ్రీరామనవమి (మార్చి 30) సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. 

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ఎస్ఎంబీ28 చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News