ఉండవల్లి కాదు ఊసరవెల్లి: గుడివాడ అమర్ నాథ్

  • సినీనటి శ్రీదేవి కంటే గొప్పగా నటిస్తోందన్న గుడివాడ
  • ఆమె వంటి నమ్మక ద్రోహుల గురించి మాట్లాడటమే వేస్ట్ అని వ్యాఖ్య
  • అందరూ ఛీకొట్టే స్థితికి ఆమె చేరుకుంటుందన్న మంత్రి
Gudivada Amarnath comments on Undavalli Sridevi

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఉండవల్లి శ్రీదేవి కాదని ఊసరవెల్లి శ్రీదేవని విమర్శించారు. సినీనటి శ్రీదేవిని మించిన గొప్ప నటి అని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఆమెకు ఇప్పుడే కనిపించాయా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే ముందు సీఎం జగన్ వద్దకు కూతురుని తీసుకెళ్లి ఫొటో దిగిందని... ఆయనను అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని అన్నారు. శ్రీదేవి వంటి నమ్మక ద్రోహుల గురించి మాట్లాడటమే వేస్ట్ అని చెప్పారు. త్వరలోనే ఆమె అందరూ ఛీకొట్టే స్థితికి చేరుకుంటుందని అన్నారు. 

బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ... దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని చెప్పారు. ఏనాడైనా ఎస్సీలకు చంద్రబాబు పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు స్కిప్ట్ ప్రకారమే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారని అన్నారు. జగన్ ను మోసం చేసిన వాళ్లకు రాజకీయ భవితవ్యం ఉండదని చెప్పారు.

More Telugu News