'శాకుంతలం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు!

  • సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం'
  • ఈ నెల 28వ తేదీన ట్రైలర్ లాంచ్ ఈవెంట్
  • వేదికగా ప్రసాద్ మల్టీ ప్లెక్స్ - స్క్రీన్ నెంబర్ 6
  • ఏప్రిల్ 14వ తేదీన సినిమా విడుదల

Shaakuntalam trailer release date cinfirmed

సమంత ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక్కో అప్ డేట్ వదులుతూ వస్తున్నారు. 

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంటుకి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును నిర్వహించనున్నారు. హైదరాబాదులోని ప్రసాద్ మల్టీప్లెక్స్ - స్క్రీన్ 6 లో ఈ వేడుకను జరపనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక మొదలుకానుంది. 

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఇందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ .. దుర్వాసుడుగ మోహన్ బాబు .. పడవ నడిపే వ్యక్తిగా ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి .. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.

More Telugu News